రష్మిక మందన్న...ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకెళ్తున్న నెంబర్ వన్ హీరోయిన్.

పుష్ప సినిమా హిట్టుతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. బాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ ఛాన్సులు కొట్టేసింది.

ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది.

దీనికి తోడు ఈ భామ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది.

నాలుగైదు హిట్ సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక... దేశంలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది.

తాజాగా ఎన్టీఆర్ 30లో రష్మిక హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

 ఎన్టీఆర్ 30కు రష్మిక భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా కోసం రష్మిక ఐదు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా... కొరటాల శివ అందుకు అంగీకరించినట్లు సమాచారం.