బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రష్మీ గౌతమ్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికి మరింత చేరువైంది.

అయితే కమెడియన్ సుడిగాలి సుధీర్‏తో ప్రేమలో ఉందనే వార్తలు ఎన్నో రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక గతంలో వీరిద్దరు సైతం తమ గురించి  వివరణ ఇచ్చుకుంటూ తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, ప్రేమ లేదంటూ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మరోసారి సుధీర్‏తో ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ.

సుధీర్, రష్మీకి మధ్య ఉంది స్నేహమా ?.. ప్రేమా ?.. పెళ్లి ? .. అని అడగ్గా..

సుధీర్‏కు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటాను.

భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో.. అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. 

మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు. ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్శించింది” అని చెప్పుకొచ్చింది.