ప్రముఖ హీరో రానా సోదరుడు, నిర్మాత సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నసినిమా అహింస

గీతికా తివారీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వం వహించారు

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై పి.కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు

కాగా అహింస చిత్రం ఏప్రిల్‌ 7న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది

ఈ చిత్రం యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు మూవీమేకర్స్

ఈ చిత్రంలో రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవీ ప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో నటించారు

ఈ చిత్రానికి సమీర్‌ రెడ్డి కెమెరామన్‌గా వ్యవహరిస్తుండగా ఆర్పీ పట్నాయక్‌ మ్యూజిక్ అందిస్తున్నారు