రమ్యకృష్ణ డైరెక్టర్‌ కృష్ణవంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..

తాజాగా దర్శకుడిగా, భర్తగా ఇద్దరిలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని రమ్యకృష్ణను ప్రశ్నించగా..

భర్తగా కంటే తనకు కృష్ణవంశీ డైరెక్టర్లానే ఇష్టమని చెప్పి షాకిచ్చింది.

ఆయనకు భార్యగా కంటే ఆయన దర్శకత్వంలో పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడతానని కుండబద్దలు కొట్టేసింది.

అంతేకాదు, ఒక యాక్టర్‌ నుంచి ఎంత నటన రాబట్టాలో ఆయనకు బాగా తెలుసని పొగడ్తల వర్షం కురిపించారు.

డైలాగ్‌ డెలవరీగానీ, పాత్ర ఎలా ప్రవర్తించాలనేది గానీ, ఆయన చాలా డిటెయిల్డ్‌ గా ఎక్స్‌ ప్లెయిన్‌ చేస్తారని,

ఆయన వివరించిన తీరుతో నటుడికి యాక్ట్‌ చేయడం చాలా ఈజీ అయిపోతుందని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

అంతేకాదు, కృష్ణ వంశీ డైరెక్షన్‌ లో పనిచేయడం చాలా ఎంజాయ్‌ చేస్తానని తెలిపారు.