ది కేరళ స్టోరీ చిత్రం దేశమంతటా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతోంది ఈ చిత్రం.
కొందరు ఈ చిత్రాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఓ వర్గాన్ని కించపరిచిందని అంటున్నారు.
ఇదిలా ఉండే తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
'తమిళ/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత, బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది.
ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే!' అని ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ 'నువ్వు పాజిటివ్‌గా స్పందించావంటే ఆశ్చర్యంగా ఉంది'.
'పాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ బాగుందా? బాలేదా? అని ఏమీ చెప్పట్లేదు ఏంటి?' అని కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.