బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తుంది.

శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఓ కీలక షెడ్యూల్‌ను ముగించింది.

ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు హీరో రామ్.

‘‘24రోజుల యాక్షన్‌ సన్నివేశాల్ని పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్‌ కాదు.. అంతకు మించి’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు రామ్‌.

ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో రామ్‌ ఓ సరికొత్త మాస్‌ లుక్‌లో అభిమానాలను అలరించనున్నారు.

ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న  పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.