టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ పోతినేని ఒకరు.
వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి అమ్మాయి ఎవరు? అనే ఆసక్తి కలగటంలో సందేహం లేదు.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు రామ్ తన గర్ల్ ఫ్రెండ్‌నే పెళ్లిచేసుకోబోతున్నారట.
స్కూల్ డేస్ నుంచి రామ్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఉంది.
ఆ పరిచయం ప్రేమగా మారిందని.. ఇప్పుడు పెళ్లి వైపుగా ఇద్దరు అడుగు లేస్తున్నారని అంటున్నారు.
పెళ్లి ఎప్పుడు? అని ఎవరైనా రామ్‌ని అడిగితే మన చేతుల్లో ఏముంటుంది.. కాలమే నిర్ణయిస్తుందని చెబుతూ వచ్చారు.
కానీ ఆ పెళ్లి సమయం దగ్గర పడిందని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.
ఇంటి పెద్దలు కలిసి ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్.
అన్ని చక్కగా కుదిరితే ఈ ఏడాదిలోనే రామ్ వివాహం ఉంటుందనేది సమాచారం.