టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం ది వారియర్‌ (The Warriorr).

బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది.

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ప్రతినాయకుడిగా కనిపించాడు.

ఈ చిత్రం జూలై 14న తెలుగుతో పాటు తమిళ్‌ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది.

ఈక్రమంలో సినిమా విడుదలై నెల రోజులైనా గడవక ముందే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

కాగా ఈ విషయాన్ని డిస్నీ హాట్‌స్టార్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.