అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు తనదైన వేగాన్ని జోడించారు, సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు

తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు, తనకి నచ్చిందే చేస్తా.. నచ్చనిది చేయనని చెప్పే ముక్కుసూటి తనం.

నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే చూడకండి అని కుండ బద్దలు కొట్టే నైజం… ఈ ఇంట్రడక్షన్‌ అంతా రామ్‌ గోపాల్ వర్మదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదూ.

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే వర్మ ఏది మాట్లాడినా సంచలనమే, ఏం మాట్లాడకపోయినా సంచలనమే.

ఈ తరం యువత కూడా వర్మ ఆలోచనలను అభిమానిస్తురాన్నంటే అతిశయోక్తి కాదు. వర్మను ఎంత తిట్టుకున్నా, అతను చేసే పనులు బాగా లేవని విమర్శించినా..

‘రామూయిజాన్ని’ ఎక్కడో ఒక చోట అన్వయించుకునే వారు చాలా మంది ఉన్నారు. వర్మ చెప్పిన సత్యాలు నిజమే కాదా అనే భావన కలగక మానదు.

శివ సినిమాతో మొదలైన వర్మ ప్రస్థానం సత్య, కంపెనీ, సర్కార్‌లాంటి ఎన్నో అద్భుత చిత్రాలతో బాలీవుడ్‌లోనూ కొనసాగింది.

60 ఏళ్ల వచ్చిన వర్మ ఆలోచనలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయనడానికి ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించిన కొటేషన్లే సాక్ష్యంగా చెప్పవచ్చు.

ఇదే తరహాలో రాము అరుదైన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

ఇదే తరహాలో రాము అరుదైన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.