మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు రామ్ చరణ్.

విభిన్నమైన కథల ఎంపికతో సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపుతూ.. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ SS రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ ఖ్యాతి, ప్రశంసలు అందుకున్నాడు.

సెలబ్రిటీగా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతాడు.

సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టినప్పటికీ అభిమానులకు టచ్‌లోకి వచ్చిందే లేదు. తనకు సంబంధించి కీలక విషయాలను షేర్ చేసుకున్న సందర్భాలూ అరుదే.

సోషల్ మీడియాకు చెర్రీ డిస్టెన్స్ పాటిస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం ఆయనకు చాలా క్లోజ్ అవుతూ వస్తున్నారు.

అందుకు నిదర్శనమే తాజా సెలబ్రేషన్. ఇన్‌స్టాగ్రమ్‌లో రామ్‌చరణ్‌కు ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లకు చేరింది. దాంతో చెర్రీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.