మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటుంది.

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడుతోంది.

తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాలో బేబీ షవర్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌ పోస్ట్ చేసింది.

తాజాగా చిరంజీవి నివాసంలో నిర్వహించిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.

అందులో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అల్లు అర్జున్ అన్నయ్య భార్య అల్లు నీలు షాతో ఉన్న ఫోటోను పంచుకున్నారు.

ప్రస్తుతం ఉపాసన బేబీ షవర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.