రేపే మెగా కుటుంబంలోకి చిన్నారి ఎంట్రీ..
చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న వెల్లడించారు.
చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే.
వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న వెల్లడించారు.
ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణీ. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు.
అయితే దాదాపు పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.
మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమయ్యారు.
మరికొద్ది గంటల్లో చిరంజీవి ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నారు.
ఈ మేరకు ఉపాసనకు జూన్ 20న డెలివరీ డేట్ ఇవ్వడంతో.. మంగళవారం పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.
రేపు ఉదయం డెలివరీ నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ దంపతులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది.