మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆస్కార్‌ ఈవెంట్‌ కోసం అక్కడకు వెళ్లిన చరణ్‌.. అక్కడి మీడియాతో మాట్లాడారు.

రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.  అలాగే మెగాస్టార్‌ చిరంజీవిపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఇక చిరంజీవి గురించి రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ..‘‘మేమంతా కలిసినప్పుడు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోము.

మా నాన్న ఇంట్లో చాలా సాధారణంగా ఉంటారు. అందుకే మా ఇంట్లో నాన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు చాలా తక్కువ ఉంటాయి’’ అని చెప్పారు. 

ఇక మరోవైపు రామ్‌ చరణ్‌ ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. 

తాను హాలీవుడ్‌ ప్రాజెక్టులో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. 

త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా  ప్రకటించనున్నట్లు తెలిపారు.