ఈయనో మెగా పవర్‌ స్టార్..! కాదు కాదు గ్లోబల్ స్టార్! ఆయనో స్టార్ క్రికెటర్! కాదు కాదు.. క్రికెట్‌ కా నయా గాడ్ !

ఇక వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ గ్లోబర్ స్టార్.. ఈ క్రికెట్ గాడ్.. రోల్‌ చేస్తే కాంట్ గెస్‌ కదా..!

వావ్ అనే ఫీలింగ్ మైండ్లో పుట్టేస్తోంది కదా..!ఆస్కార్ హడావిడితో నిన్న మొన్నటి వరకు కాస్త బిజీగా ఉన్న రామ్ చరణ్..

తాజాగా ఇండియా టుడే క్లాన్‌క్లేవ్లో.. తన మనసులోని మాటను బయటపెట్టారు.

తనకు స్పోర్ట్స్‌ బయెపిక్‌లో నటించాలనే కోరిక చాలా ఉందన్నట్టు ఆ వేదిక నుంచి చెప్పారు.

అందర్నీ ఒక్క సారిగా వావ్ అనేలా చేశారు. అంతేకాదు లుక్స్ పరంగా తాను కోహ్లీకి కాస్త దగ్గరగా ఉంటానని..

ఇది తనకు అడ్వాంటేజ్ అవుతుందన్నట్టు.. మాట్లాడారు. ఎట్ ప్రజెంట్ ఈ మాటతో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు చెర్రీ.