మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో హిట్లు ఉన్నాయి. వాటిల్లో ‘ఆరెంజ్’ మూవీ సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
రెగ్యులర్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాకపోవడంతో ‘ఆరెంజ్’ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.
ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ‘ఆరెంజ్’ డిజాస్టర్ అవ్వడంతో చిత్రాన్ని నిర్మించిన నాగబాబు అప్పుల్లో కూరుకుపోయారు.
అయితే బిగ్‌స్క్రీన్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాకపోయినా.. బుల్లితెర, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది ‘ఆరెంజ్’.
ఇప్పటికీ చాలా మంది యూత్ ఈ మూవీని చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు.
అలాంటి ‘ఆరెంజ్’ సినిమా మళ్లీ రిలీజ్ కానుంది.
మార్చి 27వ తేదీన చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.