మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

గర్భవతిగా ఉండి కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది మెగా కోడలు ఉపాసన. అటు రామ్ చరణ్, ఇటు ఉపాసన ఇద్దరూ కూడా ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఓపెన్ గా ఉంటున్నారు.

రీసెంట్‌గా శ్రీనగర్‌లో G20 సమ్మిట్‌కు హాజరైన చరణ్.. అక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉసాసన ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేశారు.

జపాన్ దేశం తన లైఫ్‌లో ఎందుకు ప్రత్యేకం అనేది కూడా ప్రస్తావిస్తూ.. తనకు ఇష్టమైన ప్రదేశంగా ఇదే అని అన్నారు చెర్రీ.

తన భార్య ఉపాసనతో పాటు తమకు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్లేస్‌తో కనెక్షన్ ఉందని రామ్ చరణ్ అన్నారు.

జపాన్‌లోనే ఆ మ్యాజిక్ జరిగిందని నవ్వుతూ ఆయన చెప్పడం విశేషం.

ప్రస్తుతం తన భార్య ఉపాసనకు ఏడో నెల అని రామ్ చరణ్ తెలిపారు.