హీరో రామ్ చరణ్ వారసుడి కోసం మెగా అభిమానులు తీవ్రంగా చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
పదే పదే తన మాతృత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడంతో ఉపాసన కూడా అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చేది.
ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఎన్నో రకాలుగా గాసిప్స్ వచ్చేవి.
పిల్లలను ఎప్పుడు కంటాం అనేది తమ ఇష్టమని, ప్రతీది పబ్లిక్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ఆ మధ్య ఉపాసన కూడా చెప్పేసింది.
చివరకు ఆ ఘడియ రానే వచ్చింది. ఉపాసన తల్లి కాబోతోందని, రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడని చిరంజీవి ప్రకటించేశాడు.
ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడని చిరు ప్రకటించాడు.
ఇక జూనియర్ రామ్ చరణ్ రాబోతోన్నాడంటూ అప్పుడే అభిమానులు సంబరపడుతున్నారు.