టాలీవుడ్ చిత్రాలలో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వారు ఉండరు 

కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన ఆమె అగ్రహీరోలతో కథానాయకిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంది

తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే 

ఇటీవల డాక్టర్ జి మూవీతో అలరించిన రకుల్  ‘ఛత్రీవాలీ’ సినిమాతో పెద్దలకు పాఠాలు చెపుతానంటూ వచ్చేస్తుంది

తేజస్‌ ప్రభ విజయ్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో కనిపించనుంది

ఈ సినిమా ద్వారా ఆమె సురక్షిత శృంగారం గురించి సమాజానికి తెలియజేయనుంది

ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది

 ‘‘చాలా కీలకమైన విషయాల్ని చాలా సున్నితంగా ఇందులో చర్చిస్తాం. నా పాత్రకు నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది’’అని రకుల్‌ తెలిపింది