టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మోడ్రన్ డ్రెస్‌లు, బికినీలతో సూపర్ అనిపిస్తోంది.

ముంబైకి మకాం మార్చిన తర్వాత స్టైలే మార్చేసింది అమ్మడు.

టాలీవుడ్‌లో వరుసగా హిట్ సినిమాలు, స్టార్‌ హీరోలతో జోడి కట్టిన రకుల్ అటుపై మకాం ముంబైకి మార్చేసింది.

తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుకున్నరకుల్ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా తో చేసిన  థాంక్ గాడ్‌ మూవీ రకుల్‌ని నిరాశపరిచింది

టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లు, ఆ తర్వాత డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంతో నార్త్‌ సినిమాలే బెటర్ అని ఫీలవుతున్నట్లుగా ఉంది రకుల్‌. 

అందుకే అక్కడే సినిమాల్లో హీరోయిన్‌ ఛాన్సులతో బిజీ అయిపోయింది

టాలీవుడ్‌లో కాస్త స్టార్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టింది రకుల్.

నార్త్ ఆడియన్స్‌కి నచ్చేట్లుగా నాటీ ఫోజులతో ..కొంటెగా చూస్తూ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 

చేసిన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో రకుల్‌ప్రీత్‌ సింగ్ సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే రెమ్యూనరేషన్‌ కూడా తగ్గించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ఆ మధ్య తెలుగులో రకుల్ యాక్ట్ చేసిన కొండపొలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో కూడ ఆచితూచి వ్యవహరిస్తోందట.

టాలీవుడ్‌లో పెద్ద డైరెక్టర్‌లు, స్టార్‌ హీరోల పక్కన ఓ వెలుగు వెలిగిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మళ్లీ అంత స్టార్ రేంజ్ వస్తుందో లేదో చూడాలి.