ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో చివరిసారిగా కొండపొలం సినిమాలో కనిపించిన రకుల్.

ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

రకుల్ మాట్లాడుతూ.. ” ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో పోటీ ఎప్పుడూ ఉండదు. నాకు నేనే పోటీ అని భావిస్తాను.

అంతేకాదు.. నన్ను నాకు అతి పెద్ద పోటీదారుడిగా చూస్తాను. నటుడిగా ఒక సినిమా నుంచి మరో సినిమాకి ఎదగడమే నా లక్ష్యం.

నేను చేసే ప్రతి పనిలో ప్రజలు తేడా చూడాలని నేను కోరుకుంటున్నాను. నేనే చేయాలనుకుంటున్నాను. నేను సెల్ఫ్ మేడ్ అమ్మాయిని.

ఇండస్ట్రీకి వచ్చి 8-9 సంవత్సరాలు అయ్యింది. నేను అలా భావిస్తే తెలుగులో పోటీతత్వం ఉంది.. తమిళంలోనూ పోటీ ఉంది.

పోటీ అనేది మాకు మరింత మెరుగ్గా ఉండేందుకు సహయపడుతుంది. నేను అలాగే ఆలోచిస్తాను. నాతో ఉన్నవారు ఎక్కువగా నటిస్తే అది నన్ను ప్రేరేపిస్తుంది.