ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.
తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజింగ్ చేసిన ఈ చిన్నది బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ రాణించింది.
ఇటీవలే డాక్టరీ జీ మూవీతో థియేటర్లలో సందడి చేసిన రకుల్.. ప్రస్తుతం థాంక్స్ గాడ్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది.
ఫాంటసీ సోషల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో రకుల్ కథానాయికగా కాగా.. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హాత్రా ప్రధాన పాత్రలలో నటించారు.
ముఖ్యంగా ఈ మూవీలో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అందాలు ఆరబోస్తూ రకుల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హీటు పుట్టిస్తున్నాయి.