టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల డాక్టర్ జీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రకుల్..

తాజాగా నార్త్ వర్సెస్ సౌత్ మూవీస్ డిబెట్‏లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది భావోద్వేగాల భాష. ఇది కేవలం సరిహద్దులు కాదు.

నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ..శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్స్ దక్షిణాదిలోనూ నటించారు. అప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి.

ఈరోజు వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ కరోనా తర్వాత చిత్ర కంటెంట్, విజయం సాధించిన సినిమాల గురించి పెద్ద చర్చే జరుగుతుంది.

ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీని వెనక చాలా శ్రమనే ఉంటుందని పేర్కొంది

అలాగే ప్రస్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒక దశ మాత్రమే అని.. ప్రజలు డిజాస్టర్ సినిమాల గురించి రాసేందుకు ఆసక్తి చూపిస్తారు.