ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది.
రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
అది అలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం.
గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి.
రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం.
ఇప్పటికే ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట.
ఈ విషయంలో త్వరలో రకుల్ ఓ ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.