ప్రముఖ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు
గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు
మధుమేహంతో బాధపడుతున్న ఆయన చికిత్సకు డబ్బులు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు
ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ దురైకు సాయమందించేందుకు ముందుకొచ్చారు
నిర్మాత వైద్య ఖర్చులు భరిస్తానని రజనీ హామీ కూడా ఇచ్చారట
రజనీ బాబా సినిమాకు దురై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు
స్టార్ హీరో సూర్య కూడా దురైకు రూ. 2లక్షల సాయం ప్రకటించారు.