ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రం నేపథ్యాన్ని పలు ఇంటర్వ్యూలో తెలిపారు.
అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఓ ఆసకక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఈ చిత్రం ప్రకటన కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.
కాగా కథ పూర్తి అవడానికి మరో రెండు నెలలు పట్టనుందని సమాచారం.
ప్రస్తుతం మహేశ్‌బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.