ఎండుద్రాక్ష అందం ఇనుమడించటానికీ తోడ్పడుతుంది. దీనిలో ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి.

నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం దండిగా ఉంటుంది. అలాగే క్యాల్షియం కూడా బాగానే ఉంటుంది. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెళుసు బారకుండా కాపాడతాయి.

నల్ల ఎండుద్రాక్షలో ఐరన్‌తో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి.

ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదులు తగ్గటంలో సాయం చేస్తుంది. కాబట్టి తరచూ కాసినిన ఎండుద్రాక్షలను తింటుంటే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది.

రోజూ కొన్ని ఎండుద్రాక్ష పళ్లను తినటం గుండె ఆరోగ్యానికీ మేలే. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరి. గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.

నల్ల ఎండుద్రాక్షలో ఐదు వృక్ష రసాయనాలు పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతున్నట్టు అమెరికాలో నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి

వీటిల్లో పీచూ ఎక్కువగానే ఉంటుంది. ఇది మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ఎండుద్రాక్ష మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికీ తోడ్పడుతుంది. శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఛాతీ మంట, అజీర్ణం తగ్గటానికీ దోహదం చేస్తుంది.