పొట్టి ప్రపంచ కప్‌పై లానినా తుఫాన్.. ఇప్పటికే 4 మ్యాచ్‌లపై ఎఫెక్ట్.. రాబోయే మ్యాచ్‌లు కూడా..

టీ20 ప్రపంచ కప్ 2022లో 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా వాష్ అయ్యాయి.

మొదట ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ వర్షంతో తుడిచిపెట్టుకపోగా, ఆ తర్వాత ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ పడలేదు. ఇప్పటివరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఫలితం రాలేకపోయాయి.

ఇక రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

లా నినా ప్రభావం నవంబర్ అంతటా కొనసాగుతుంది. అంటే 2022 టీ20 ప్రపంచకప్ వినోదాన్ని వర్షం పాడు చేస్తూనే ఉంటుందంట.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్న జట్లకు మ్యాచ్ రద్దు కంటే పెద్ద జట్లకు సెమీఫైనల్ తలుపులు మూసుకపోయే ఛాన్స్ ఉంది.

గ్రూప్-1లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా అసంపూర్తిగా ఉన్నాయి.

అందులో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్-ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో ఒక్క బంతి కూడా పడలేదు.

ఇక ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌లో వర్షం పడడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనను పాటించి మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించారు.

దీంతో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.