IND vs SA: 14 ఏళ్లుగా ద్రవిడ్ రికార్డుకు ఢోకా లేదు.. ఈసారి బద్దలయ్యే ఛాన్స్?

రాహుల్ ద్రవిడ్ 541 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 1997 పర్యటనలో మూడో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. 9 గంటల బ్యాటింగ్‌లో ద్రవిడ్ 362 బంతులు ఆడి, 148 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

దక్షిణాఫ్రికాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డెలివరీలు ఆడిన రెండో బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. 2011 పర్యటనలో 314 బంతుల్లో 146 పరుగులు చేశాడు.

దీనికి ముందు 1992 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రవీణ్ ఆమ్రే ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 299 బంతులు ఆడి 103 పరుగులు చేశాడు.

2001 దక్షిణాఫ్రికా పర్యటనలో, దీప్దాస్ గుప్తా ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 281 బంతులు ఆడి, 63 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.