‘లకలకలకలక..’ అంటూ ప్రేక్షకులను భయపెట్టిన చిత్రం ‘చంద్రముఖి’.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’

పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, రాధిక శరత్‌కుమార్‌, లక్ష్మీ మీనన్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో లారెన్స్‌ వద్ద ఓ విలేకరి చిత్రంలోని కీలకమైన పాము సన్నివేశం గురించి ప్రస్తావించారు.

‘అది సస్పెన్స్‌.. చంద్రముఖి మూడో భాగంలోనే దానికి ముగింపు ఉంటుంది’ అంటూ ‘చంద్రముఖి 3’ సైతం ఉంటుందని చెప్పకనే చెప్పారు లారెన్స్‌.

‘చంద్రముఖి 2’ చిత్రం తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందించిన చిత్రం థియేటర్ లో కాకుండా ఓటీటీలో  విడుదల కానుంది.