కార్తిక వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది.అయితే ఆఫర్లు లేక సినిమాలకు దూరమైన కార్తిక..

బిజినెస్‌ రంగంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లా కెరీర్‌ మొదలు పెట్టింది.

ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలను అభివృద్ధి చేయడంలో కొన్ని సంవత్సరాలుగా కార్తిక విశేషమైన పాత్ర పోషించింది.

సిల్వర్‌ స్క్రీన్‌ పై సక్సెస్‌ కాలేకపోయినా.. వ్యాపార రంగంలో విజయం సాధించింది.

ఇకపోతే కార్తిక నాయర్కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందింది.

గత కొన్నేళ్ల నుంచి దుబాయ్‌ లో ఉంటూ యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్గా కార్తిక గుర్తింపు పొందింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయ్‌ లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో..

యుఎఇకి చెందిన హమద్‌ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు.దీంతో కార్తిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.