చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది.

నిజానికి మద్రాస్‌ కేఫ్‌ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సెటిలైపోయింది.

'నేను నటించిన మద్రాస్‌ కెఫె సినిమా అయిపోయాక రాజమౌళి సర్‌ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు.

తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను.

కానీ రాజమౌళి సర్‌ నన్ను చూసి చాలా క్యూట్‌గా ఉందీ అమ్మాయి, ఏదైనా లవ్‌ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నాడు.

నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్‌ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

అలా ఊహలు గుసగుసలాడేతో నేను తెలుగులో లాంచ్‌ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.