2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’ చిత్రంలో ఆర్ మాధవన్, సిద్ధార్థ్ మొదటిసారి కలిసి నటించారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్ళి ఆర్ మాధవన్, సిద్ధార్థ్ కలిసి తెరపై సందడి చేయనున్నారు.
క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘టెస్ట్’ చిత్రంలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది.
కొత్త దర్శకుడు శశికాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.
దీన్ని బట్టి క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
అరుదైన కలయికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కూడా కనిపించనునట్లు సమాచారం.