భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురించి అందరికీ పరిచయమే.

 టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది.

పీవీ సింధు గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఇంటర్వ్యూలలో తెలుసుకున్నాం.

కొన్ని సందర్భాలలో ఈమె కొందరి నటీనటుల సమక్షంలో కూడా పాల్గొని చాలా విషయాలు పంచుకుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఆలీతో సరదాగా షోలో పాల్గొంది.

 ఇక అందులో సింధు తో బాగానే సందడి చేసినట్లు కనిపిస్తుంది.

ఇందులో మీకు న‌చ్చిన హీరో ఎవ‌ర‌ని అడిగితే చాలా మంది హీరోలు న‌చ్చుతారు అని స‌మాధానం ఇచ్చింది సింధు.

వెంటనే ఆలీ మాట్లాడుతూ ఎవ‌రైనా ఒక‌రి పేరు చెప్పు అనడంతో ప్ర‌భాస్ అని చెప్పింది సింధు.