ఎన్ని పండుగలు వచ్చిన తమ అభిమాన హీరో పుట్టిన రోజునే పెద్ద పండుగ భావిస్తారు సినీ అభిమానులు
అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సందడి మొదలైంది
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే
ఇదివరకే ఈ చిత్రం నుంచి పోస్టర్ విడుదల విడుదల కావాల్సివుండగా అది కుదరలేదు
అయితే ఈ చిత్ర బృందం అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌తోపాటు, లుక్‌ని విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్
దానిపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది
కాగా అల్లు అర్జున్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం