డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో రామ్  కలయికకు చిత్ర ప్రేమికుల్లో మంచి క్రేజ్‌ ఉంది.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ భారీ విజయాన్ని అందుకుంది.

కాగా ఇప్పుడీ కంబో మరోసారి రిపీట్ కానుంది.

ఇటీవలే పూరి వినిపించిన ఓ కథ రామ్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ చిత్రాన్ని ఛార్మి పూరి కనెక్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నారు.

ప్రస్తుతం రామ్‌ బోయపాటి శ్రీను తెరకెక్కుస్తున్న ఓ మాస్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఈ కొత్త చిత్రం మొదలుకానుందని సమాచారం.

అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.