నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో  దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో  అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ  చిత్రంలో ప్రభాస్‌ని ఢీ కొట్టే విలన్‌ ఎవరో తెలియదు కానీ.. అతడి సైన్యం పేరు మాత్రం బయటికొచ్చింది.

రైడర్స్‌ పేరుతో ఆ సైన్యం గుంపులు గుంపులుగా సందడి చేయనుంది.

ఈ మేరకు సోమవారం విలన్‌ సైన్యం రైడర్స్‌ డ్రెస్‌ తయారీకి సంబంధించిన వీడియోని  విడుదల చేసింది చిత్రబృందం.

మరి ఆ రైడర్స్‌ కథేమిటో? వాళ్ల నాయకుడి కథేమిటో తెలియాలంటే సినిమా విడుదల వరకు వీచి ఉండవలసిందే.