శరీరం సజావుగా పని చేయాలంటే అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు అవసరమని మనందరికీ తెలిసిందే

ఈ విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది

విటమిన్-డికి అతిపెద్ద వనరులలో ఒకటి సూర్య కిరణాలు

విటమిన్-డి అధికంగా ఉండటం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి

  అధిక విటమిన్-డి ఫలితంగా మీరు కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, మలబద్ధకం లేదా అతిసారం సంభవించవచ్చు

మీ శరీరంలో విటమిన్-డి అధికంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండలేరు. నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తుంది

శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని కారణంగా చాలా దాహం వేస్తుంది

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీయవచ్చు