తెలుగు ప్రేక్షకులకు ప్రియాంక మోహన్‌ పరిచయం అవసరం లేని హీరోయిన్.

మొదటిగా  తెలుగులో నానికి జోడిగా ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత యంగ్ హీరో శర్వానంద్‌ సరసన ‘శ్రీకారం’ చిత్రంలో చేసింది.

తమిళంలో స్టార్ హీరోల పక్కన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.

అయితే స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నటించనుంది ప్రియాంక.

సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా  ‘ఓజి’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై  డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కోసమే ప్రియాంక మోహన్‌ని హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం.