స్టార్ హీరోయిన్స్ సైతం పవన్ కళ్యాణ్‌తో నటించే ఆఫర్ వస్తే వదులుకోరు
ఆయనతో కలిసి వెండితెర పంచుకునే అవకాశం వచ్చిందంటే చాలు డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు
అయితే యంగ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ మాత్రం పవన్ కళ్యాణ్‌తో చచ్చినా చేయనంటూ బాంబ్ పేల్చింది
కాగా దీనికి ఓ బలమైన కారణం ఉందని ప్రియాంక చెబుతోంది
అయితే పవన్ కళ్యాణ్ అంటే తనకు పిచ్చి అని, ఆయనంటే పడి చస్తానని, ‘తమ్ముడు’ సినిమాను తాను 20 సార్లు చూశానని, ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ గుర్తుందని ప్రియాంక తెలిపింది
తాను పవన్‌కి వీరాభిమానినని.. దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోతానని తెలిపింది
అంతకుమించి తానేం కోరుకోవడం లేదని.. ఒకవేళ మూవీలో నటించే అవకాశం వచ్చినా చేయనని ఆమె పేర్కొంది
పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావట్లేదని ప్రియాంక తెలిపింది