హిందీ చిత్రసీమలో ఎలా అయితే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సాధించిందో ఇప్పుడు హాలీవుడ్‌లోనూ చాలా సాధించాలని కష్టపడుతోందామె.

ప్రియాంక ఇటీవల ఓ సందర్భంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని తమిళ చిత్రం అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ప్రియాంకను విపరీతంగా ట్రోల్‌ చేశారు. తాజాగా ఇదే విషయంపై ఆమె స్పందించింది.

‘‘నేను ఏది చేసినా అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటున్నారు కొందరు.

బహుశా అది వాళ్లకు ఆనందం కలిగించి ఉండొచ్చు. అందుకే ఇవన్నీ పట్టించుకోకపోయినా కాస్త జాగ్రత్తగా అయితే ఉంటాను.

ఎందుకంటే నాకంటూ ఇప్పుడు ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది. అభిమానులున్నారు. ప్రస్తుతం నా దృష్టంతా వాళ్లమీదే పెట్టాను’’అని చెప్పింది.

 ఇది ఓటీటీల కాలం. ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవ లేదు.

అందుకే ఎంతోమంది ప్రతిభావంతులు హద్దులు చెరిపేస్తూ ప్రపంచ చిత్రసీమలో మెరుస్తున్నారు’’అని చెప్పింది ప్రియాంక.