ఏం అందాంరా బాబు మైండ్ లో నుంచి పొవట్లేదు.. 

Rajeev 

08 March 2024

ప్రియమణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. 2003లో వచ్చిన ఎవరే  అతగాడు అనే సినిమాతో పరిచయం అయ్యింది.

ఆతర్వాత దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది.

మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ . రావణ్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది.

హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవలే బాలీవుడ్ లో జవాన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

సినిమాలతో పాటు భామా కలాపం అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది.ఇటీవలే భామా కలాపం 2 స్ట్రీమింగ్ అయ్యింది.