నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో మాత్రం సెలబ్రిటీలందరినీ స్టేజ్ పైకి తీసుకొస్తోంది.

గతేడాది బాలయ్య హోస్ట్ గా తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ షో మొదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ స్టార్ సెలబ్రిటీలను షోకి ఇన్వైట్ చేస్తున్నాడు బాలయ్య.

ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ – గోపీచంద్ ల వంతు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంది.

బాలయ్య షో కోసం ప్రభాస్ కలర్ ఫుల్ చెక్ షర్ట్, జీన్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ప్రభాస్ షర్ట్ పైనే కన్నేశారు.

ప్రభాస్ వేసుకున్న షర్ట్ వివరాల్లోకి వెళ్తే.. ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’.. దీని ధర 115 పౌండ్స్.

 ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 11,618/-. కాగా ప్రస్తుతం ప్రభాస్ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువైపోయాయి.