కార్తీక దీపం సీరియల్‌ పేరు వినగానే ముందుగా గుర్తుచ్చే పేరు వంటలక్క.

సీరియల్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న దీప.. వెండితెరపై కూడా కనువిందు చేయబోతోంది.

ప్రేమి విశ్వనాథ్ కు ఉన్న క్రేజ్ తో ఆమె భారీ రేంజ్ పారితోషికం అందుకుంటోంది.

కార్తీకదీపం సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా లక్షకు పైగానే తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది.

అంతేకాకుండా మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ లక్షల్లో పారితోషికం అందుకుంటోందట ప్రేమి విశ్వనాథ్.

ఇక ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆమె దగ్గర 50 కోట్లకు పైగానే ఆస్తి ఉందని తెలుస్తోంది.

 రెండు లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన భవనం ఆమెకు ఉందని సమాచారం.

 ఓవైపు సీరియల్స్ లో నటిస్తూ మరోవైపు సినిమాల్లో భాగమవుతూ ప్రేక్షక ఆదరణ పొందుతున్న దీప సంపాదన రానున్న రోజుల్లో రెట్టింపు కావడం ఖాయం.