శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది
తీవ్రమైన చలిని తట్టుకోవాలన్నా.. కాలానుగుణమైన మార్పులను తట్టుకోవాలన్నా రోగ నిరోధక శక్తి అవసరం
రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా మీ డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
వెల్లుల్లి గ్యాస్‌ను తొలగించడమే కాకుండా శరీరానికి వేడిని అందిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది
శరీరాన్ని వేడిగా ఉంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. అందుకే మీరు తీసుకునే ఆహారంలో అల్లం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం మంచిది
చలికాలంలో పసుపు పాలు తాగితే గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది
ఉసిరిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కావున.. మీరు తినే ఫుడ్ లిస్ట్‌లో ఈ పండును కూడా చేర్చుకోవడం ఉత్తమం
రోజూ ఒక గ్లాసు ఆవు పాలు తాగడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది