నారింజ పండు లో విటమిన్ సి,పోలిక్ యాసిడ్ వంటి విటమిన్లను ఉంటాయి. ఇవి పుట్టబోయే బిడ్డకు బ్రెయిన్, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది.

మామిడి పండులో విటమిన్ ఎ,విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ లోపాలు లేకుండా ఉంటాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో రోజు నిమ్మరసం తాగాలి. దీనివల్ల మీకు వాంతులు, వికారం వంటివి రాకుండా ఉంటాయి.

అరటి పండులో పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దానికి అరటి పళ్ళు పరిష్కారం చూపిస్తాయి.

యాపిల్ పండ్ల వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. యాపిల్ ని తొక్కతో సహా తినండి.

గర్భంతో ఉన్న సమయంలో బ్లూ బెర్రీస్, రాస్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఎక్కువగా తినాలి. మీ పుట్టబోయే బిడ్డకు ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి.

విటమిన్ బి అవకాడో పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి గర్భిణీలకు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి.