పురాతన కాలంలో గర్భధారణ పరీక్షలు ఎలా చేసేవారంటే..
ప్రస్తుతకాలంలో ఎన్నో ఆధునిక పద్దతులలో గర్భధారణ పరీక్షలు చేస్తున్నారు.
అయితే పురాతన కాలంలో ఎలా చేసేవారో ఎప్పుడైనా ఆలోచించారా.
ఇప్పుడు పురాతన ఈజిప్షియన్ స్త్రీలు ఎలా గర్భధారణ పరీక్షలు చేసుకొనేవారో తెలుసుకుందాం.
ఈజిప్షియన్ స్త్రీలు ముందుగా గోధుమలు, బార్లీ గింజలపై మూత్ర విసర్జన చేసివారు.
కొన్ని రోజులకు గోధుమలు పెరిగినట్లయితే, అది ఆడ శిశువు అని అంచనా వేసేవారు.
అలాగే కొన్ని రోజులకు బార్లీ పెరిగినట్లయితే, అది మగ శిశువును అంచనా వేసేవారు.
గోధుమలు, బార్లీ ఏమీ పెరగకపోతే ఆ స్త్రీ గర్భవతి కాదని నిర్దారించేవారు.