సాయంత్రం వ్యాయామం చేయడం, నడవడం శరీర కండరాలకు ఉత్తమ సమయం అంటున్నారు ఆరోగ్య నిపుణుల.
ఈ సమయంలో ఒత్తిడి లేని నడకను ఆస్వాదిస్తారు. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కూడా బాగా నిద్ర పడుతుంది.
సాయంత్రం నడవడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
సాయంత్రం నడవడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వల్ల శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది.
ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడల్లా, మొదటి కొన్ని నిమిషాలు వేగాన్ని తగ్గించాలి. ఆ తరువాత శరీరం వేడెక్కినప్పుడు.. వేగాన్ని పెంచాలి.
చురుకైన నడక కొవ్వును వేగంగా కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గుతుంది.
బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
క్రమంగా నడక సమయాన్ని అరగంటకు పెంచాలి. వాకింగ్ ప్రారంభించే ముందు బరువు ఎంత ఉన్నారో చెక్ చేసుకోవాలి.
ఆ తరువాత ప్రతివారం ఎంత నడిచారో చెక్ చేసుకోవాలి. అలాగే మీ బరువును కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.
వాకింగ్‌కు వెళ్లాలనుకునే వారు సరైన షూస్, సౌకర్యవంతమైన డ్రెస్ ధరించాలి.