ఎల్లప్పుడు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడం కోసం దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగాలి

నిమ్మరసం, మజ్జిగ పాలు/లస్సీ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి

సన్నగా, వదులుగా, కాటన్ వస్త్రాలను ధరించాలి

బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ డైరెక్ట్‌గా ఎండ తాకకుండా చూసుకోవాలి

ముఖ్యంగా పగలు కిటికీలు, కర్టెన్‌లను మూసి సాయంత్రం సమయంలో చల్లటి గాలిని లోపలికి రావడానికి వాటిని మళ్లీ తెరవాలి

శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు శరీరానికి సరిపడా ద్రవాలను తీసుకోవాలి

ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలి

ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలు తాగడం మానేయాలి