రెండు మూడేళ్లకోసారి అయినా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం వంటి సమస్యల గురించి కీలక సమాచారం తెలుస్తుంది
అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహార, జీవన నియమాల్లో మార్పులు, సూచించిన మెడిసిన్ వాడుకోవాలి
కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉంటె అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరికి జన్యుపరంగా వ్యాధుల రావచ్చు
ఛాతీలో తీవ్ర అసౌకర్యం, భారం, బరువు మోపినట్టు అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి
రోజుకు 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి
ఎక్కువగా గురక పెడితే ఓ సారి కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి
ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం