రేపు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత దేశంలో గ్రహణం ఏర్పడే సమయం.. పై కొన్ని నమ్మకాలు ఉన్నాయి
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గ్రహణం హానికరమని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు
గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఆహారం జీర్ణమవ్వడంతో ఇబ్బంది తలెత్తుంది
గ్రహణం ఏర్పడిన సమయంలో స్నానం చేయవద్దు. గ్రహణాలను నేరుగా చూడవద్దు
గ్రహణం ఏర్పడినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకూ శారీరక శ్రమ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి
కత్తి, కత్తెర , సూదులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దని పెద్దలు చెబుతారు
గ్రహణం ఏర్పడినప్పుడు ఏమైనా ఆహారపదార్ధాలను వండినట్లు అయితే దర్భతో కానీ తులసి ఆకులను వేసిగానీ భద్రపరచండి
గర్భిణీ స్త్రీలు పనులు చేయవద్దని, బహిర్భూమికి వెళ్లవద్దని పెద్దలు సూచించారు